కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ అంటే భయం అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే నెలలో గోవ అసెంబ్లి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా గోవా లో పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మోడీ ఫోబియా ఉందని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. కాగ గోవాలో బీజేపీ యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. గోవా ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు.
కాగ బీజీపీ గోవాను బంగారు గోవాగా తీర్చిదిద్దుతుందని అన్నారు. కానీ గోవా ప్రజలు గాంధీ కు కుటుంబాన్ని తరష్కరిస్తారని అన్నారు. అలాగే గోవా రాష్ట్రంలో పోటీ చేయడానికి ఇతర రాష్రాల నుంచి కొన్నిపార్టీలు వస్తున్నాయని టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్ధేశించి అన్నారు. కానీ అవి ప్రభుత్వ ఏర్పాటులో ఏ మాత్రం ప్రభావం చూపవని జోస్యం చేప్పారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్క బీజేపీకే సాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిన్న రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోడీ ఎప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.