అహ్మదాబాద్ లోని జైడస్​ టీకా అభివృద్ధిని సమీక్షించిన మోదీ

-

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి పై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటన చేపట్టారు. శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్న మోదీ.. అక్కడి జైడస్‌ క్యాడిలా బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డి’ టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్‌ ధరించి వ్యాక్సిన్‌ ప్రయోగశాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాల్లో ఉంది. దాదాపు గంటపాటు ప్లాంట్‌లో గడిపారు. అంతకుముందు సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్‌లతో మోదీ చర్చించారు.

modhi
modhi

మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అహ్మదాబాద్‌ తర్వాత ప్రధాని మోదీ.. హైదరాబాద్‌, పుణెల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’‌, పుణెలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ ప్రయోగాలను మోదీ పరిశీలించనున్నారు. కరోనాపై పోరులో భారత్‌ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో వ్యాక్సిన్‌ సన్నద్ధత పై శాస్త్రవేత్తలతో చర్చించేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపింది. టీకా అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి మార్గ సూచీ వంటి అంశాలను ప్రధాని ఈ పర్యటనలో సమీక్షించనున్నట్లు పేర్కొంది. ప్రధానిని చూసేందుకు జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. వారికి మోదీ అభివాదం చేశారు.

ప్రపంచ దేశాలు కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో ముందు అడుగు వేస్తున్న వేళ.. మన సొంత టీకాను అభివృద్ధి చేసేందు భారత్ ప్రయత్నిస్తోంది. అత్యంత జనాభా కలిసిన మన దేశంలో టీకాను అభివృద్ధి చేసి ప్రజలకు అందిచటనమనేది సవాల్ తో కూడుకున్న ఆంశం. కేంద్రం ఇప్పటికే టీకా పంపిణీ పై కసరత్తు చేస్తోంది. మరో వైపు ఆగ్రరాజ్యం మరో రెండు వారాల్లో ఫైజర్ టీకాను అందుబాటులోకి తీసుకురావటానికి సన్నదమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news