రామరాజు ఫర్ బీమ్.. టాలీవుడ్ లో కొత్త రికార్డు..!

టాలీవుడ్లో ఓటమెరుగని దర్శకుడిగ గా ఉన్న రాజమౌళి ప్రస్తుతం మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు ఈ సినిమాలో నటిస్తూ ఉండటం అది కూడా స్వాతంత్ర సమరయోధుల పాత్రలో నటిస్తుండడం ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెంచేస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ విడుదలైన కూడా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే రామరాజు ఫర్ భీమ్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తున్నది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా రికార్డుల మోత మోగిస్తోంది ఈ వీడియో. ఇప్పటికే ఈ టీజర్ ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది ఈ స్థాయిలో కామెంట్ దక్కించుకున్న మొదటి టీజర్ ఇదే కావడం గమనార్హం. టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది.