బ్రేకింగ్; మోడీ మరో సంచలన నిర్ణయం…!

194

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్ళడానికి సిద్దమవుతుంది. జనాలు బయటకు వస్తే కరోనా వైరస్ సోకే అవకాశం ఉంది కాబట్టి జనాలను ఇప్పట్లోఇళ్ళ నుంచి బయటకు రానీయకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించి దాన్ని కఠినం గా అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు లాక్ డౌన్ ని మరింతగా పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. లాక్ డౌన్ ని ఏప్రిల్ 14 వరకు ఇప్పుడు ప్రకటించగా కరోనా వైరస్ అప్పటికి కట్టడి కాకపోతే మాత్రం దాన్ని మరింతగా పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర కేబినేట్ సమావేశంలో ఇదే అభిప్రాయం మోడీ వ్యక్తం చేయగా దానికి మంత్రులు కూడా అంగీకారం తెలిపారట.

15 నుంచి మే 20 వరకు పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చర్యలను ఇంకా కఠినం చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎక్కడిక్కడ కఠిన నిర్ణయాలు చేస్తేనే కట్టడి అవుతుందని అంటున్నారు. వైరస్‌ మరింత విజృంభిస్తే అందరికీ చికిత్స చేసే మౌలిక వైద్య సదుపాయాలు మన దేశంలో అందుబాటులో లేవని, పరిస్థితులు అదుపు తప్పితే నియంత్రణ సాధ్యం కాదని అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.