రసవత్తరంగా గ్రేటర్ : ప్రచారానికి మోడీ కూడా ?

Join Our Community
follow manalokam on social media

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. మొన్న అనూహ్యంగా దుబ్బాకలో గెలిచిన ఆ పార్టీ ఈసారి గ్రేటర్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకోసం అగ్రశ్రేణి నేతలు కూడా ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సహా డజను మంది అగ్ర నాయకులు ప్రచారం చేయనున్నారని అంటున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయడంతో ప్రచారం కూడా ఈరోజు చేస్తారని అంటున్నారు.

“జాతీయ పార్టీ నాయకుల ప్రచార షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ వారి పర్యటన గురించి మాకు ధృవీకరణ లభించింది ”అని ఎంఎల్‌సి, సిటీ యూనిట్ మాజీ అధ్యక్షుడు ఎన్ రామ్‌చందర్ రావు ఒక జాతీయ పత్రికకు చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ అభ్యర్థుల కోసం కాన్వాస్ చేయడానికి హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. అయితే మోడీ కూడా ప్రచారం చేసే అవకాశం ఉండనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది ?

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...