చలికాలం చర్మం పొడిబారకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

చలికాలం వచ్చిందంటే చర్మం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్న మాటే. చలికాలంలో చర్మ సమస్యలు చికాకు పెడుతుంటాయి. ముఖ్యంగా చర్మం పొడిబారడం, పగుళ్ళు ఏర్పడటం వంటివి మరింత ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వీటి బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఒకరోజులో ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం మానేయాలి. రోజులో రెండుసార్లు కడిగితే సరిపోతుంది.

గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.

చర్మాన్ని తేమగా చేసేందుకు మాయిశ్చరైజర్ వాడటం మంచిది. మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏది పడితే అది తెచ్చుకోవద్దు. మీ చర్మం రకానికి ఏది సెట్ అవుతుందో అది మాత్రమే వాడండి.

వీలైనన్ని ఎక్కువ నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల్లో ఆకుకూరలు బాగా తినాలి. గుడ్లు, దానిమ్మ మొదలైనవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి.

పెదాలు ఎండిపోయి పగుళ్ళు ఏర్పడితే వాటికి నెయ్యి పూసుకోవడం మంచిది. రాత్రిపూట నెయ్యితో మర్దన చేసుకుంటే తెల్లారే సరికి తేమగా తయారవుతాయి.

చలికాలం అరికాళ్ళలో పగుళ్ళు ఇబ్బంది పెడుతుంటాయి. పడుకునే మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ ధరించి పడుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే అరికాళ్ళలో పగుళ్ళు తగ్గిపోతాయి.

ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చలికాలంలో చర్మ పొడిబారకుండా ఉండి ఇబ్బంది పెట్టదు. మార్కెట్లో దొరికే చాలా వస్తువులు చర్మ సంరక్షణానికి బాగా ఉపయోగపడతాయి. అందులో మీ చర్మ రకానికి ఏది బాగా నప్పుతుందో అది మాత్రమే వాడాలి. వీలైతే చర్మ వైద్య నిపుణులని సంప్రదించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news