కథనం: సాక్షాత్తు ప్రధానియే ఇంత దిగజారిపోవడమా?

-

కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలపై తమ ఆధిపత్యాన్ని మరో సారి నిరూపించుకుంది. ఇందులో భాగంగానే సీబీఐ డైరెక్టర్ గా సుప్రీం ఆదేశాల మేరకు బాధ్యతలు సేకరించిన ఆలోక్ వర్మను తొలగిస్తూ నేడు ఉత్తర్వ్యూలు జారీ చేయడం. తాము చెప్పినట్లు వినకపోతే ఎంతటి వారినైనా తప్పించడం ఖాయమని ప్రధాని ఆధ్వర్యంలోని కమిటీ చెప్పకనే చెప్పింది. గత కొద్ది నెలల క్రితం ఓ కేసు విషయంలో సీబీఐ ప్రత్యక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా, అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మల మధ్య చెలరేగిన వివాదం కేంద్ర జోక్యంతో  చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో ఆ ఇద్దరి అధికారులను బలవంతపు సెలవులపై పంపుతు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని తప్పుబడుతూ…సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సీబీఐ ని ఆశ్రయించారు. వర్మ వాదనలు విన్న సుప్రీం రెండు రోజుల క్రితం కేంద్రాన్ని తప్పుబడుతూ…వెంటనే వర్మను విధుల్లో చేరాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ప్రధాని మోడీ అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుని ఇతర బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయమై సీరియస్ గా స్పందించిన  సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ కొత్త ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సహజ న్యాయానికి వ్యతిరేకంగా తనను తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించిన విధానం సరైందికాదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పరువు తక్కువ దారులను ఎంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఈ విషయమై నేడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకొనసాగుతోంది. సాక్షాత్తు ప్రధాని సైతం సీబీఐ వంటి సంస్థలో ఉన్న వారిని సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూడటం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్దమనుకుంటున్నారు. ఏది ఏమైన కేంద్రం జోక్యంతో సీబీఐ, ఆర్బీఐలు తమ స్వతంత్ర్యాన్ని ఎప్పుడో కోల్పోయాయని చెప్పడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం.

Read more RELATED
Recommended to you

Latest news