రాకేశ్ అస్థానాకు చుక్కెదురు…

-

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అవినీతి ఆరోపణల వ్యవహారంలో తనపై నమోదైన కేసును పరిగణించరాదంటూ…అస్థానా వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టిపారేస్తూ… ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచి… 10 వారాల్లోగా ఈ దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో పాటు అస్థానాపై క్రిమినల్‌ దర్యాప్తు చేపట్టకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును కూడా న్యాయస్థానం రద్దు చేసింది.  గతంలో మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీ కేసులో తనను తప్పించేందుకు ఓ మధ్యవర్తి ద్వారా రాకేశ్‌ అస్థానాకు తాను లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సతీశ్ బాబు చెప్పడంతో రాకేశ్ అస్థాన అవినీతి వ్యవహారం బయటకొచ్చింది.

అయితే.. రాకేశ్‌ అస్థానా, సీబీఐ డిప్యూటీ ఎస్పీ దేవేందర్‌ కుమార్‌, మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్‌లపై కొద్ది నెలల క్రితం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసుని సవాల్‌ చేస్తూ వీరు ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే.  దీంతో ఈ కేసులో అస్థానాను అరెస్టు చేసే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news