మోడీ ఆస్తుల విలువ తెలుసా..?

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఆస్తులు వాటి విలువను తాజాగా ప్రకటించారు. మొత్తం కేవలం రూ.3.07 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయని మోడీ డిక్లరేషన్ లో సమర్పించారు. అంతే కాకుండా తనకు సొంత వాహనం కూడా లేదని..స్టాక్ మార్కెట్ లో పెట్టు బడులు పెట్టలేదని పేర్కొన్నారు. మార్చి 31, 2021 వరకు తన బ్యాంకు ఖాతాలో 15లక్షల రూపాయలు ఉన్నాయని తన వద్ద రూ. 36,000 నగదు మరియు రూ.1.48 లక్షల విలువైన గోల్డ్ రింగ్ కూడా ఉందని చెప్పారు.

ఇక మిగతా ఆస్తులు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని మోడీ వెల్లడించారు. అంతే కాకుండా తన అన్నదమ్ముల తో కలిసి ఉమ్మడి ఇల్లు ఉందని…తనకు సొంతంగా ఇల్లు కూడా లేదని డిక్లరేషన్ లో స్పష్టం చేశారు. ఇక ఈ వార్త చూసినవాళ్లు షాక్ అవుతున్నారు. ఊర్లో సర్పంచులే కోట్లు సంపాదిస్తున్నారు అని ప్రధాని అంత తక్కువ ఆస్తులను కలిగి ఉన్నారా అని అవాక్కవుతున్నారు.