బండి సంజయ్‌కి మంత్రి హరీష్ రావు లేఖ.18 ప్రశ్నలకు స్పందించాలని సవాల్!

-

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజులు హట్‌ హట్‌గా కొనసాగుతుంది..తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సమాధానం ఇవ్వాలని బహిరంగా లేఖ విడుదల చేశారు..దాదాపు 18 రకాల ప్రశ్నలతో లేఖ విడుదల చేశారు..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వీటికి సామాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు..కేంద్రంలో ఉన్న అధికార బీజేపీ పార్టీ తెలంగాణకు అడుగుడుగా అన్యాయం చేస్తుందని..దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ నైతిక విలువలు మంటగలిపేలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు..వ్యక్తిగత దూషనలు,దాడులకు పాల్పడుతుందన్నారు మంత్రి..తెలుగు రాష్ట్రా మధ్య నీటి వివాదాలను సృష్టిస్తూ..ప్రజల మధ్య విబేధాలు సృష్టించింది బీజేపీ అని విమర్శించారు..పోలవరం జాతీయ స్థాయి హోదా ఇచ్చినప్పడు..తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వకుండా బీజేపీ ఎందుకు మీనమేశాలు వేస్తుందని ప్రశ్నించారు..బీజేపీ పార్టీకి తెలంగాణపై ప్రేమ ఉంటే నీతి ఆయోగు చెప్పిన విధంగా నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు మంత్రి..విద్యత్ ఉద్యోగు విభజన చేయకుండా తెలంగాణ రాష్ట్రంపై అదనపు భారం పడటానికి బీజేపీ కారణం కాదా అని మంత్రి లేఖ ప్రశ్నించారు..తెలంగాణ దుబ్బాక జాతీయ రహదారి ప్రకటించి ఇప్పటికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని..మీకు దుబ్బాకపై చిత్త శుద్ధి ఉంటే మీ మంత్రిలో మాట్లాడి నిధులు విడుదల చేయించండి అన్నారు మంత్రి.. ఫించన్లు, ప్రాజెక్ట్ లు, ఏయిర్‌ఫోర్ట్‌లలో తెలంగాణకు చాలా అన్నాయం చేస్తున్నారని..వెంటనే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి న్యాయం చేయాలి డిమాండ్ చేశారు..టెక్ట్స్ టైల్ పార్క్‌ లకు గుజరాత్ వంటి రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం వరంగల్ టెక్ట్స్ టైల్ పార్క్‌ కు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని సంజయ్‌ ని ప్రశ్నించారు..గిరిజనుల రిజర్వేషన్లపై ఎందుకు నిర్ణయం తీసుకొవడం లేదని..కొత్త నవోదయ విద్యాలయాలపై కేంద్రాకి ప్రతిపాదనలు పంపితే..ఎందుకు వాటిని మంజూరు చేయడం లేదని. మీకు తెలంగాణపై ఎంత శిత్త శుద్ధి ఉందో తెలుస్తుందని మంత్రి ప్రశ్నించారు..మూసీ నది ప్రక్షాలనకు నిధులు, అభివద్ధి నిధులపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని..కేంద్రం తెలంగాణకు వేల కోట్లు బాకీ ఉందనీ..కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ నిధులను రాష్ట్రానికి తీసుకురావాలని మంత్రి లేఖలో పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news