రేపటి నుంచి మూడు రోజుల పాటూ జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటన ఉంటుంది. జార్ఖండ్‌లోని టాటానగర్‌లో 660 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాన మంత్రి మోడీ. జార్ఖండ్‌లో ఆరు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాన మంత్రి మోడీ.. అనంతరం.. గుజరాత్ గాంధీ నగర్‌లోని మహాత్మా మందిర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ , ఎక్స్‌పో (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ‘సుభద్ర’- అతి పెద్ద, ఒంటరి మహిళా కేంద్రీ కృత పథకం ప్రారంభించనున్న పిఎం మోడీ… భువనేశ్వర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది PMAY లబ్దిదారుల గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొననున్నారు. అదనపు కుటుంబాల సర్వే కోసం ఆవాస్+ 2024 యాప్‌ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు రేపటి నుంచి మూడు రోజుల పాటూ జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటన ఉంటుంది.