కాంగ్రెస్ లోకి వెళ్లిన అరికెపూడి గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మీద హత్యా యత్నం కేసు నమోదు అయింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీతో పాటు కొడుకు, సోదరుడి మీద హత్యా యత్నం కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు.

ఈ ఘటనపై ఎస్ ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే ఒక కేసు అయింది. ఆ కేసులో బెయిల్ తీసుకున్నారట శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ. ఇక తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీపై హత్యా యత్నం కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి.