తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర‌మొగుల‌య్య పాట‌…నెట్టింట వైర‌ల్..!

ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌న్నార్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. స‌జ్జ‌న్నార్ నిర్న‌యాల‌తో ఆర్టీసీపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక ఆర్టీసీ అభివృద్ధికి మాత్ర‌మే కాకుండా ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త కోసం కూడా స‌జ్జ‌న్నార్ ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా పెళ్లికి అడ్వాన్స్ అవ‌స‌రం లేకుండానే బ‌స్సును ఎప్పుడంటే అప్పుడు బుక్ చేసుకునే స‌దుపాయాన్ని స‌జ్జ‌న్నార్ తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా పెళ్లికి ఆర్టీసీ బ‌స్ బుక్ చేసుకున్న‌వారికి ఓ ఫోటో ఫ్రేమ్ ను సైతం గిఫ్ట్ గా ఇస్తామ‌ని ప్ర‌కటించారు. ఇక ఇటీవ‌ల బాల‌ల దినోత్స‌వం సంధ‌ర్బంగా వారికి ప్రయాణం ఉచితమ‌ని ప్ర‌క‌టించారు.

kinnera mogulayya song on rtc
kinnera mogulayya song on rtc

అంతే కాకుండా స‌జ్జ‌న్నార్ ప‌లుమార్లు ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణిస్తూ ప్ర‌జ‌ల‌కు ఆర‌ద్శంగా నిలిచారు. ఇదిలా ఉండ‌గా భీమ్లా నాయ‌క్ సినిమాలో ఓ పాట‌కు కిన్నెర స్వరాలు అందించిన క‌ళాకారుడు మొగుల‌య్య త‌న కూతురు పెళ్లి కోసం ఆర్టీసీ బ‌స్సును బుక్ చేసుకున్నాడు. కాగా స‌ర్వీస్ న‌చ్చ‌డంతో ఆయ‌న ఆర్టీసీ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఓపాట‌ను పాడారు ఆపాట ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాంతో ఆ పాట‌ను ఆర్టీసీ అధికారులు షేర్ చేస్తున్నారు.

http://

కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa
— Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021