అలెర్ట్ : మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3 .1కిలోమీటర్లు ఎత్తులో విస్తరించియున్నది . ఈ ఉపరితల ఆవర్తనంనుండి ఒక అల్పపీడన ద్రోణి ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు పరిసర ప్రాంతాలనుండి తమిళనాడు తీరము వరకు సగటు సముద్ర మట్టానికి 3 .1కిలోమీటర్లు ఎత్తులో విస్తరించియున్నది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మూడు ప్రాంతాల్లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ కేంద్రము