మెగా స్టార్ కు నటుడు మోహన్ బాబు ఊహించని గిఫ్ట్..!

-

నటిస్తే ప్రతి తెలుగు వాడు పొంగిపోతాడు, కనిపిస్తే ప్రతి అభిమాని ఆరాధిస్తాడు, రఫ్ఫాడిస్తా అంటూ ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్టు 22 కు ఆయన 66వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిత్రసీమ ప్రముఖులు సహా అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి… అయితే ఊహించని విధంగా నటుడు మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు బహుమతి పంపించారు.. ఈ మాటలు విన్న ఎవరైనా నిజమా అని అంటారు… ఎందుకంటే వారి మధ్య పలుమార్లు మీడియా వేదికగా, సినిమా ఫంక్షన్ల వేదికగా జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే… అయితే ఇప్పుడు చిరంజీవికి మోహన్ బాబు పుట్టినరోజు బహుమతి ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

chiru and mohan babu gift
chiru and mohan babu gift

ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. మోహన్ బాబు తొలిసారిగా తనకు బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ గిఫ్ట్ ఏమనుకుంటున్నారు కధ.. అది ఓ బైక్ కళాకృతి.. దానితోపాటు ఫోటో దిగి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.” నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్ బాబు ” అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news