తక్కువ సమయంలోనే మీ డబ్బులు డబుల్… ఐదు లక్షలకి పది లక్షలు..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీములతో చాలా రకాల ప్రయోజనాలని పొందవచ్చు. భద్రత, అధిక రాబడి ఆశించే వారికి పోస్ట్ ఆఫీసు స్కీమ్స్ బెస్ట్. అధిక రాబడిని పోస్ట్ ఆఫీసు పథకాలుతో పొందవచ్చు. ప్రభుత్వం భరోసా కూడా అందుతుంది. పోస్ట్ ఆఫీసు పథకాలు లో పెట్టుబడిని డబుల్ చేసే పథకాలు కూడా ఉన్నాయి. ఈజీగా ఈ స్కీమ్స్ తో సూపర్ బెనిఫిట్స్ వున్నాయి. రిస్క్ ఏమి ఉండదు. రూ. 5లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 10లక్షలు మీకు వస్తాయి. పథకం పేరు పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్. కాంపౌండ్ ఇంటరెస్ట్ వస్తుంది. పెట్టుబడి డబుల్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పై వడ్డీ రేటును పెంచింది కూడా.

ఖాతా ప్రారంభించిన వారికి వడ్డీ రేటు 7.5శాతం వస్తుంది. ఈ స్కీము లో మీరు రూ. 5లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి మీరు రూ. 7,24,974 వస్తుంది. వడ్డీగా రూ. 2,24,974 వస్తుంది. స్కీము మెచ్యూరిటీ వ్యవధిని ఐదేళ్ల నుంచి మరో ఐదేళ్లు పెంచి 10 ఏళ్లకు కొనసాగిస్తే రూ. 10,51,175 అవుతుంది. ఇందులో పెట్టుబడిపై వడ్డీనే రూ. 5,51,175 ఉంటుంది. పదేళ్లలో డబ్బులు అవుతాయి. మీరు రూ. 100 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు.

ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ మైనర్ పేరున ఖాతా ప్రారంభించాలనుకుంటే గార్డియన్స్ గా తల్లిదండ్రులు ఉండాలి. ఈ ఖాతా ని మీరు సింగిల్ గా లేదా జాయింట్ గా ప్రారంభించవచ్చు. దీనిలో మీరు రూ.1000 నుంచి గరిష్టంగా పెట్టుబడి పెట్టొచ్చు. ఏడాదికి లేదా రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లకు ఒకసారి పెట్టుబడి ని మీరు పెట్టవచ్చు. ఏడాదికి 6.8 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్లకు 6.9, మూడేళ్లకు అయితే 7.0శాతం, ఐదేళ్లకు అయితే 7.6శాతం వడ్డీ రేటు వస్తుంది. చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.5లక్షల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news