కర్ణాటక సీఎం సహా మంత్రులందరికీ నేరచరిత్ర.. ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి

-

కర్ణాటకలో ఇంతకుముందున్న బీజేపీ అవినీతి ప్రభుత్వమని దేశవ్యాప్తంగా చాలా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ నేర చరిత్ర కలిగిన వారేనట. ఈ విషయాన్ని ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌) తాజా నివేదిక తేల్చింది.

నలుగురు మంత్రులపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయని ఈ నివేదిక పేర్కొంది. మంత్రులంతా అత్యంత ధనవంతులేనని తెలిపింది. కోటీశ్వరుల జాబితాలో తొమ్మిది మంది మంత్రులు ఉన్నారని వెల్లడించింది. 9 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.229.27 కోట్ల పైబడే ఉన్నాయని చెప్పింది. ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రూ.1413.80 కోట్ల ఆస్తులు కలిగిన మంత్రిగా ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా చిత్తాపూర్‌ నియోజకవర్గానికి చెందిన ప్రియాంక్‌ ఖర్గే రూ.16.83 కోట్లతో జాబితాలో చివరన ఉన్నారు.

ఇక ఎందరిపై ఎన్ని కేసులున్నాయంటే..?

  • సీఎం సిద్ధరామయ్య- కేసులు 13,(సీరియస్‌ -6)
  • డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ -కేసులు 19, (సీరియస్‌ -6)
  • లక్ష్మణ్‌రావు -2 కేసులు
  • ఎంబీ పాటిల్‌ – 5 కేసులు
  • రామలింగారెడ్డి – 4 కేసులు
  • బీజే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ – 5 కేసులు
  • కేహెచ్‌ మునియప్ప -1 కేసులు
  • డాక్టర్‌ జీ పరమేశ్వర – 3 కేసులు
  • ప్రియంక ఖర్గే – 9 కేసులు

Read more RELATED
Recommended to you

Latest news