బ్యాంక్ అలర్ట్: ఈరోజు రాత్రి నుండి డబ్బులు NEFT ద్వారా పంపించడానికి అవ్వదు..!

-

బ్యాంక్ కస్టమర్లకు గమనిక. ఈ విషయాన్ని గమనించండి. ఈ రోజు రాత్రి నుండి NEFT పేమెంట్ అవ్వదు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈరోజు రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు నెఫ్ట్ ద్వారా పేమెంట్ జరగవు అని వెల్లడించింది.

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఒక ముఖ్యమైన ఫీచర్. అదే విధంగా ఇది వన్ టూ వన్ పేమెంట్ ఫెసిలిటీ. దీని వల్ల సులభంగా డబ్బులని పంపించుకోవచ్చు. నెఫ్ట్ సిస్టమ్ ద్వారా డబ్బులు పంపించాలంటే ఈరోజు 12:01 నుండి రేపు మధ్యాహ్నం అంటే ఆదివారం మధ్యాహ్నం 2 వరకు అవ్వవు.

Image

టెక్నికల్ అప్గ్రేడ్ కారణంగా ఇది పని చేయదని ఆర్బీఐ చెప్పింది. రేపు మధ్యాహ్నం తర్వాత యధావిధిగా పేమెంట్స్ అవుతాయి అని కూడ ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ నెట్ బ్యాంకింగ్ లో నెఫ్ట్ సర్వీసెస్, యోనో, యోనో లైట్ రాత్రి 12:1 నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేయవు అని చెప్పింది. టెక్నికల్ అప్గ్రేడ్ కారణంగా ఇవి జరగని మీరు గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news