ఎవరు ఎన్ని చెప్పినా సరే కరోనా వైరస్ మాత్రం వన్యప్రాణులకు బాగా కలిసి వచ్చింది. వేలాది జంతువులు ప్రజలు రోడ్ల మీదకు రాకపోవడంతో అవి వచ్చి తిరుగుతున్నాయి. పులులు, సింహాలు, అడవి పందులు, జింకలు, పాములు, కోతులు ఇలా ప్రతీ ఒక్కటి అడవుల నుంచి బయటకు వచ్చి సందడి చేస్తున్నాయి. కోతులు స్విమ్మింగ్ ఫూల్ లో తిరగడం సహా రోడ్ల మీదకు వచ్చి ఇళ్ళల్లో కి కూడా వెళ్తున్నాయి.
తాజాగా ఒక కోతి అయితే గాలి పటం ఎగురవేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక కోతి గాలిపటం ఎగురవేస్తున్న వీడియో చూసి నెటిజన్లకు కొత్త హుషారు వస్తుంది. “లాక్డౌన్ కారణంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కోతి గాలిపటం ఎగురవేస్తుంది. అవును, ఇది ఖచ్చితంగా కోతి” అనే శీర్షికతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు.
12 సెకన్ల వీడియోలో ఒక కోతి టెర్రస్ అంచున కూర్చొని గాలిపటం చాలా తేలికగా ఎగారవేస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన వెంటనే, ఇది విస్తృతంగా వైరల్ అయింది. లక్ష వ్యూస్ సాధించడమే కాకుండా చాలా మంది వాట్సాప్ స్టేటస్ అయింది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు అడవి జంతువులు చేస్తున్న సందడి మాత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది జనాలను.
Evolution happening fast due to lockdown?
Monkey flying a kite. Yes it’s a monkey for sure? pic.twitter.com/6W8MtpPK43
— Susanta Nanda IFS (@susantananda3) April 16, 2020