ఎట్టకేలకు ఒప్పుకున్న చైనా… 6.5 లక్షల కిట్స్ ఈ రోజే పంపిస్తుంది…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే… ఇప్పుడు పరిక్షలు ఎక్కువగా జరగాల్సిన అవసరం ఉంది. వేల మందికి మాత్రమే దేశ వ్యాప్తంగా కరోనా పక్షాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లక్షల మందికి జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి అవకాసహం ఉంటుంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో పరిక్షల వేగం పెరగాల్సిన అవసరం ఉంది.

ఈ నేపధ్యంలో మన ప్రభుత్వం చైనాకు భారీగా కరోన టెస్టింగ్ కిట్స్ ని ఆర్డర్ చేసింది. ఇన్నాళ్ళు దీనిపై స్పందించని చైనా వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసింది గాని మన దేశానికి ఇవ్వలేదు. అయితే తాజాగా టెస్టింగ్ కిట్స్ ఇవ్వడానికి చైనా రెడీ అయింది. చైనా నుంచి మన దేశానికి 6.5 లక్షల కిట్స్ రానున్నాయి. వాటితో పాటుగా చైనా నుంచి ఆర్ఎన్ఏ కిట్స్ కూడా మన దేశానికి రానున్నాయి.

ఈ రోజు మన దేశానికి ఈ కిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర కిట్స్ ని ఆర్డర్ చేసాయి. వీటిపై స్పష్టత రావడం లేదు. చైనా ఇస్తుందా లేక కేంద్రానికే నేరుగా ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మన దేశంలో కరోనా పరీక్ష ఫలితాలు రావడానికి ఆరు గంటల సమయం పడుతుంది. ఈ కిట్స్ ద్వారా వేగంగా చేసే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news