రైతులకు బ్యాడ్ నూస్.. నైరుతి రుతుపవనాలు ఈసారి లేటేనట..!

కేరళ నుంచి తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రావడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఈలెక్కన 11 న ఏపీని, 13న తెలంగాణను రుతుపవనాలు తాకే అవకాశం ఉందట.

వర్షాకాలం ఇక ప్రారంభం అయినట్టే. క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం అయింది కానీ.. ఎండలు మాత్రం ఇంకా దంచికొడుతూనే ఉన్నాయి. ఇదివరకు 20 ఏళ్ల కింద జూన్ 1 వచ్చిందంటే చాలు.. వర్షాలు విపరీతంగా పడేవి. ఇప్పుడు కాలం మారిపోయింది కదా.. జూన్ మొదటి వారం ముగియడానికి దగ్గరికి వస్తున్నా.. ఇంకా రుతుపవనాల జాడే లేదు.

ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవనుందట. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి దక్షిణ అరేబియాలోకి వచ్చిన నైరుతి రుతుపవనాలు.. వాతావరణం అనుకూలించకపోవడంతో మందగించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో కేరళకు రావడానికే మరో 72 గంటల సమయం పడుతుందట. అంటే కేరళను ఈనెల 8న నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.

కేరళ నుంచి తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రావడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఈలెక్కన 11 న ఏపీని, 13న తెలంగాణను రుతుపవనాలు తాకే అవకాశం ఉందట.