మూసీకి వరదపోటు.. హైదరాబాద్ అప్రమత్తం.. బయటకు రావద్దంటున్న పోలీసులు

గులాబ్ తుఫాను ఇంకా ధడ పుట్టిస్తూనే ఉంది. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దీంతో మూసీకి వరద పోటెత్తుతోంది. దీంతో హైదరాబాద్లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేశారు. దీంతో

 లోతట్టు ప్రాంతాల్లో మూసీ ప్రవాహం పెరుగుతోంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను అనుమతించడం లేదు. నగరంలో ఛాదర్ ఘాట్ వంతెనను అనుకుని నది ప్రవహిస్తోంది. కోఠి-ఛాదర్ ఘాట్ మధ్య వాహనాల రాకపోకలు అనుమతించకపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. గత అనుభవాలు ద్రుష్టిలో పెట్టుకున్న అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బయటకి రావద్దని పోలీసులు కోరుతున్నారు. నగరంలోని కోెఠి, మూసారాంబాగ్, ఛాదర్ ఘాట్, శంకర్ నగర్, మలక్ పేటలకు వరద పొంచి ఉంది.