ప్రెస్ క్లబ్ ఉద్రిక్తత : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరెస్ట్

సినీ నటుడు పోసాని కృష్ణ మోహన్… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో… మీడియా సమావేశం నిర్వహించారు పోసాని కృష్ణ మోహన్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేశారు పోసాని కృష్ణ మోహన్.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి చేరుకున్నారు. పోసాని కృష్ణ మోహన్ మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు జనసేన కార్యకర్తలు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో… పోలీసులు మరియు పవన్ అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక చివరికి పవన్ అభిమానులను మరియు జన సేన కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితులు అదుపులోకి వచ్చిన్నట్లు సమాచారం అందుతోంది.