పవన్ ఓ సైకో… ఆయన శీలం పోయింది : పోసాని

పవన్ కళ్యాణ్ పై మరోసారి పోసాని మురళి కృష్ణ.. నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ ఒక సైకో అని…పవన్ లా శీలం పోగొట్టు కున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. తన భార్య శీలం ఆమె దగ్గరే ఉందని..తన భార్య చనిపోతే, తాను అదే రోజు చనిపోతానన్నారు. ఎవరో ఫంక్షన్లు పెట్టుకుంటే అక్కడికి పవన్ మనుషులు ఎందుకు వస్తున్నారని.. ఫైర్ అయ్యారు.

చిరంజీవి కూతుర్ల పై కేశినేని కామెంట్స్ చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు.. ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదని నిప్పులు చెరిగారు పోసాని. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు.. ఆరోపణలు చాలా మంది పై ఉంటాయన్నారు..పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారని.. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారని గుర్తు చేశారు.. అపుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్ పై పగ పెట్టుకునే ఆలోచన లేదని.. తాను జగన్ అభిమానిని.. అందుకే రియాక్ట్ అయ్యానని స్పష్టం చేశారు. నిన్నటి నుంచి ప్రతి సెకండ్ కు పవన్ మనుషుల ఫోన్లు వస్తున్నాయని.. బూతులు తిడుతున్నారని మండిపడ్డారు.రాజకీయాలకు , ఇంట్లో వాళ్లకు సంబంధం ఏంటి.. ? అని ప్రశ్నించారు. మళ్ళీ పవన్ ఫ్యాన్స్ నుంచి ఫోన్లు వస్తే.. పవన్ భార్య, అమ్మ వాళ్ళను తిడుతానని హెచ్చరించారు.