బిజెపితో టచ్ లో 55 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు?

-

ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీకీ రానున్న కొద్ది రోజులలో బిగ్ షాక్ తగలనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వైసిపి పార్టీకి చెందిన 55 మందికిపైగా ఎమ్మెల్యేలు బిజెపి పార్టీతో టచ్ లోకీ వెళ్లారన్న కథనంతో అధికార పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చినప్పటికీ పోటీ చేయడానికి సిద్ధంగా లేరని తెలిసింది. వీరు గత కొంతకాలంగా ఇతర పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం.

సీఎం జగన్ నిర్ణయాలతో అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారని విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఆదాయం కూడా లేకపోవడంతో ఎన్నికలలో పెట్టిన ఖర్చులు అయినా తిరిగి తెచ్చుకోవచ్చని బిజెపి ఇచ్చిన బంపర్ ఆఫర్ కు బెండ్ అయ్యారా, లేక ఇదంతా కల్పితమేనా అనే చర్చ జరుగుతుంది. దీనిపై సీఎం జగన్కు కూడా నివేదిక అందినట్లు తెలుస్తోంది. వీరిపై ఇప్పటికే జగన్ గట్టి నిగా పెట్టారని, వీరిలో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే ఉన్నారని సమాచారం. మరి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news