మోత మోగిద్దాం కార్యక్రమం ద్వారా నిరసన తెలిపిన టీడీపీ

-

ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు అనేక మార్గాలు అనుసరిస్తుంటాయి. ధర్నాలు, సమ్మెలు, బంద్‌, ముట్ట‌డి లాంటివి చేప‌డుతాయి. ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో చాలా సహజం. తాజాగా చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఇచ్చిన పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున మోత మోగిద్దం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయం దగ్గర మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తెలుగు మహిళలు పాల్గొన్నారు. అలాగే ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఎంపీ కనకమేడలు ఈ నిరసన కార్యక్రమంలో విజిల్స్, గంటలు మోగించారు.

ఢిల్లీలో లోకేశ్... రాజమండ్రిలో బ్రాహ్మణి... మోత మోగించారు!... ఫొటోలు ఇవిగో!

ఇక, 6 గంటల 55 నిమిషాల నుంచి నుంచి 7.05 నిమిషాల వరకు ఈ నిరసన కొనసాగుతుంది. బూరలు, డబ్బులతో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. బ్రాహ్మణీ నిరసన కార్యక్రమం వద్ద పోలీసులు మోహరించారు. అలాగే హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చౌరస్తాలో తెలంగాణ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లలో ఉన్న వారు గంటలు, ప్లేట్లు, విజిల్స్ కొడుతూ చంద్రబాబు అరెస్ట్ కు నిరసన వ్యక్తం చేశారు. వెహికిల్స్ తో రోడ్లపై ఉన్న వాళ్లు హారన్ కొడుతూ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేయగా.. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ ప్రాంతాల్లో ప్రజలు సైతం మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news