ఎంత ఘోరం: పిల్లలు ప్రాణాలకు తమ ప్రాణాలను బలిచ్చిన వీరవనితలు…

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని భగత్ సింగ్ నగర్ లో అనుకోకుండా ఒక విషాద సంఘటన జరిగింది. క్షణాలలో రెండు నిండు ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి. వేసవికాలం కావడంతో ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్న ఒక గుంటలో పడిపోయారు. ఇది పెన్నానది రివిట్మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలు కావడంతో చాలా లోతు ఉన్నాయి. అయితే పడిపోయిన పిల్లలను కాపాడాలని ఆ పిల్లలు తల్లులు అయిన షబీనా మరియు షాహినా లు ఆ గుంటలో దూకి వారిని రక్షించాలని ప్రయత్నించారు. అయితే చివరికి ఆ పిల్లలను అయితే సకాలంలో బయటకు తీసుకువచ్చి కాపాడగలిగారు. కానీ వీరు బయటకు రావాలని ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఈ గుంతలోనే ఇరుక్కుని ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.

దీనితో భగత్ సింగ్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మ ఎంత గొప్పదంటే తన బిడ్డల ప్రాణాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసేంత గొప్ప మనిషి.