తాజాగా నెల్లూరు జిల్లా SP తిరుమలేశ్వర్ రెడ్డి పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5 మందిపై పీడీ యాక్ట్ ను నమోదు చేశామని చెప్పారు. పీడీ యాక్ట్ నమోదు చేసిన వారు అంతా కూడా వివిధ SEB కేసులలో ముద్దాయిలుగా ఉన్నవాళ్లేనని చెప్పారు. ఆ అయిదు మందిలో ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. ఇక జిల్లాలో రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాలు అయిన గంజాయి అక్రమంగా రవాణా చేయడం , గంజాయి అమ్మడం మరియు సేవించడం వంటి వాటిపై మేము ఉక్కుపాదం మోపుతున్నామంటూ SP చెప్పారు.
ఇక ప్రజలను ఇబ్బంది పెట్టే ఎటువంటి నేరాలకు పాల్పడే వారిపై కారణమైన చర్యలు తప్పవని నేరస్థులను హెచ్చరించారు. ఇక గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం నేరాలు తగ్గించాలన్న లక్ష్యంతోనే పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలుస్తోంది.