గుడ్ న్యూస్: “ది కేరళ స్టోరీ” ఓటిటి రిలీజ్ ఫిక్స్… !

ఈ మధ్యన వచ్చిన సినిమాలలో ఎక్కువ నెగటివిటీ తో పాపులార్టీ దక్కించుకున్న సినిమాగా ది కేరళ స్టోరీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇందులో ఆదా శర్మ కీలక పాత్ర పోషించి సినిమా విజయానికి కారణం అయింది. ఈ సినిమా తర్వాత తనకు బాలీవుడ్ మరియు టాలీవుడ్ నుండి ఆఫర్ లు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. ప్రేక్షకులు అంతా కూడా ఎప్పుడెప్పడు ఓటిటి లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జూన్ 23వ తేదీ నుండి జీ5 లో తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 230 కోట్లకు పైగానే వసూలు చేసింది. మరి ఓటిటి లోనూ తన సత్తా చాటుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.