హైదరాబాద్: మాజీ ఈటల రాజేందర్‌పై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈటల రాజేందర్ అవనీతిపరుడని ఆయన వ్యాఖ్యానించారు. ఈటలకు అంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈటలను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈటలను బీజేపీలో చేర్చుకోవడం బాధించిందని చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని మోత్కపల్లి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళిత సమావేశం నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టి దళిత బంధు అద్భుతమని వ్యాఖ్యానించారు.
ఇక మోత్కుపల్లి నిర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ దళిత అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో మోత్కుపల్లిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన అప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
కాగా మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో ఆయన బీజేపీలో చేరారు. తాజాగా ఆయన రాజీనామా చేయడంతో మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.