శివం అంటే శుభప్రదం అని అర్థం. లింగం అంటే సంకేతం. మీరు ఎక్కడ చూసినా శివలింగాలు దాదాపుగా నల్లరాతి రూపంలోనే ఉంటాయి. శివుడిని పూజించాలంటే శివలింగాన్ని పూజించాలి. శివలింగానికి పూజిస్తే శివుడికి పూజలు సమర్పించినట్టే. ‘కదిలే శివలింగం’
శివుడు దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన్ను పూజిస్తాం. కానీ.. ఇతర దేవుళ్లను పూజించినట్టే ఆయన్ను పూజిస్తామా? అంటే అస్సలు కాదు. ఇతర దేవుళ్లకు వాళ్ల ప్రతిరూపాలు ఉంటాయి. కానీ.. శివుడికి ప్రతిరూపం ఉండదు. కేవలం శివలింగం మాత్రమే ఉంటుంది. మీరు ఏ శివుడి గుడికి వెళ్లినా అక్కడ శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది తప్పితే శివుడి రూపం మాత్రం కనిపించదు.
అసలు శివలింగం అంటే ఏంటి. శివం అంటే శుభప్రదం అని అర్థం. లింగం అంటే సంకేతం. మీరు ఎక్కడ చూసినా శివలింగాలు దాదాపుగా నల్లరాతి రూపంలోనే ఉంటాయి. శివుడిని పూజించాలంటే శివలింగాన్ని పూజించాలి. శివలింగానికి పూజిస్తే శివుడికి పూజలు సమర్పించినట్టే.
సరే.. ప్రపంచంలో మీరు ఎన్నో శివలింగాలను చూసి ఉంటారు. కానీ… ఈ శివలింగాన్ని మాత్రం అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన శివలింగం. దీనికి ఉన్న పేరు ఏంటో తెలుసా? కదిలే శివలింగం దీని పేరు.
ఈ కదిలే శివలింగం… ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ శివలింగాన్ని దుగ్దేశ్వర్నాథ్ అని కూడా పిలుస్తారు.
నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. దానికి ఇది ఉపలింగమట. ఇక.. దీని ప్రత్యేకత కదలడం. ఈ శివలింగం కదులుతూ ఉంటుంది. అయితే మనుషులు చేతితో ఎంత కదిపినా కదలని శివలింగం.. దానికదే కదలడంతో దీనికి చాలా మహత్తు ఉందని భక్తులు నమ్ముతారు. ఈ శివలింగానికి 2000 ఏళ్ల చరిత్ర ఉందట.
అయితే.. ఇది ఎప్పుడు కదిలేది మాత్రం తెలియదు. ఈ శివలింగం కదులుతుండగా పూజారులు చాలాసార్లు చూశారట. శివలింగం కదులుతోందని అక్కడ వార్త వ్యాపిస్తే చాలు.. ప్రజలంతా తండోపతండాలుగా వెళ్లి కదులుతున్న శివలింగాన్ని దర్శించుకొని వస్తారట. అలా ఈ కదిలే శివలింగం ఉత్తర్ ప్రదేశ్ లో ఫేమస్ అయిపోయింది.
అంతు చిక్కని శివయ్య లీల.. 12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది…!