నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రజా ప్రతినిధుల కోర్టుల బిగ్ ఊరట లభించింది. జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఫ్లేక్సీలను చిపివేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ కేసు నమోదు అయింది. కాగ ఈ కేసుపై నేడు ప్రజా ప్రతినిధుల కోర్టు విచారించింది. ఇరు వర్గాల వాదనలు ఉన్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఉన్న కేసును కొట్టివేసింది. అయితే ఇటీవల జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఫ్లేక్సీలను చింపివేసి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఎంపీ అరవింద్ పై అభియోగం ఉంది.
దీనిపై టీఆర్ఎస్ నాయకులు.. 2020 నవంబర్ లోనే ఎంపీ అరవింద్ పై కేసు నమోదు చేయాలని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ అరవింద్ పై కేసు నమోదు అయింది. అనంతరం పోలీసులు ఎంపీ అరవింద్ పై ఉన్న అభియోగ పత్రాన్ని ప్రజా ప్రతినిధుల కోర్టులో దాఖలు చేశారు.
అలాగే ఈ కేసు విచారణకు హాజరు కాలేడని ఈ నెల 24న ఎంపీ అరవింద్ కు నాన్ బెయిలబుల్ వారంట్ కూడా జారీ అయింది. నేడు ఎంపీ అరవింద్ కోర్టుకు హాజరు కాగ.. కోర్టు విచారణ జరిపింది. అయితే ఈ అభియోగంపై తగిన ఆధారాలు లేవని కోర్టు ఈ కేసును కొట్టివేసింది.