RECORD : వన్ డే లలో కోహ్లీ 66వ హాఫ్ సెంచరీ !

-

ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన కీలకమైన సూపర్ 4 మ్యాచ్ జరుగుతోంది. వాస్తవంగా నిన్న జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. కాగా ప్రస్తుతం క్రీజులో కోహ్లీ మరియు రాహుల్ లు ఉన్నారు.. ఇద్దరూ కూడా అర్ధ సెంచరీ లను పూర్తి చేసుకున్నారు. ఇక ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సూపర్ బ్యాటింగ్ తో కెరీర్ లో 66వ అర్ధ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు. ఇటీవల కోహ్లీ ఫామ్ చూస్తే ఏమంత గొప్పగా లేకపోయినా ఈ మ్యాచ్ లో పరుగులు చేయడం చాలా కీలకం.. ఇక గత మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఒక మాదిరి ప్రదర్శన చేసిన టీం ఇండియా ఇందులో ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. కోహ్లీ మరియు రాహుల్ ఇద్దరూ మంచి జోరు మీద ఉండగా, ఇక్కడి నుండి ఎన్ని పరుగులు చేసి పాకిస్తాన్ కు టార్గెట్ గా అందిస్తారు అన్నది చూడాలి.

కాగా ఈ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ అభిమానులకు కనుల విందుగా మారనుంది అన్నది కంఫర్మ్.. కోహ్లీ ఈ అర్ద సెంచరీ ని సెంచరీ గా మలుచుకుంటాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news