తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను కాదని, కార్యకర్తలను కాదని, ఆఖరికి అధినేతనూ కాదని వైకాపా ఎంపీ ఏమిసాదిద్దామనుకుంటున్నారు? నిన్నటివరకూ ఎదురైన ప్రశ్న ఇది! ఆయనకు ఢిల్లీలో పలుకుబడి మామూలుగా లేదు.. పార్లమెంటు పరిశరాల్లో మోడీ అంతటియానకూడా “రాజు గారు ఎలా ఉన్నారు” అని పలకరించిన చరిత్ర ఆయనది.. కేంద్రమంత్రుల ఆఫీసుల్లోకి తలుపు తీసుకుని వెళ్లగల చనువు ఆయనది.. బీజేపీ అధిష్టాణం పెద్దలతో పార్టీలు చేసుకునే అంత స్నేహం ఆయనది.. అని సమాధానం! అంటే మిగిలినవారంతా అయానకంటే తక్కువ అనీ కాదు, అందరికంటే ఆయన ఎక్కువ అనీ కాదు! మరి జగన్ కు ఏమైనా ఢిల్లీలో పలుకుబడి ఉందంటారా?
ఇప్పుడు అసలు పాయింట్ లోకి వస్తే… వైసీపీతో వ్యవహారాన్ని కేంద్రంతోనే తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లారు రఘురామకృష్ణం రాజు! ఎన్నికల కమిషన్ కు, కేంద్రమంత్రులకు, లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయ నిర్ణయించారంట! అయితే… జగన్ పై ఫిర్యాదు కోసం వచ్చారని తెలియగానే స్పీకర్ తోపాటు మిగతా కేంద్రమంత్రులు కూడా మొక్కుబడిగా స్పందించారని తెలుస్తోంది! దానికి కారణం.. రాజుగారు ఢిల్లీ చేరే సమయానికే జగన్ కూడా తన పలుకుబడి ఉపయోగించారని అంటున్నారు!
లోక్ సభలో వైసీపీ నాలుగో అతిపెద్ద పార్టీ. రాజ్యసభలో 6వ పెద్ద పార్టీ. వైసీపీతో బీజేపీ పెద్దలకు చాలా పని ఉంది. అందుకే వైసీపీ అధినేత సీఎం జగన్ ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించారని అంటున్నారు. దీంతో రాజుగారికి తత్వం బోదపడిందంట! వెంటనే.. నేరం నాది కాదని నెపాన్ని సాయిరెడ్డిపై మోపి.. వైసీపీ షోకాజ్ నోటీసుకు జగన్ కు సమాధానం ఇస్తానని తెలిపారట! ఇలా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణంరాజుకి ఆశాభంగం కలిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు! దీంతో… ఇంతకాలం రఘురామకృష్ణం రాజు చెప్పిన మాటలు వాపా.. బలుపా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారంట!