పతనం అంచుల్లో ఏపీ పోలీస్ ప్రభుత్వం : ఎంపీ రఘురామ

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. పతనం అంచుల్లో ఏపీ పోలీస్ ప్రభుత్వం ఉందని జోస్యం చెప్పారు. జీవో1 రాజ్యాంగ విరుద్ధమని, కోర్టుకు వెళ్తే కొట్టేస్తారని రఘురామ తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన నాయకుడిని అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు రఘురామ. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భేటీతో తమ పార్టీ వాళ్ల ప్యాంట్లు తడిసిపోయాయని ఎద్దేవాచేశారు. వైసీపీ కి భయం లేకుంటే సాక్షిలో అంతపెద్ద వార్తలు ఎందుకు? అని ప్రశ్నించారు రఘురామ.

ఎన్నికలపై సర్వే రిపోర్ట్ వచ్చినట్లుందని, అందుకే తమ పార్టీ ముందస్తుకు వెళ్లడం లేదని విమర్శించారు రఘురామ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పొత్తు కుదురుతుందన్నారు రఘురామ. పవన్ ఒక్క సినిమా తీస్తే రూ.100 కోట్లు.. ఆయనకు అడుక్కునే కర్మ ఏంటి? అని ప్రశ్నించారు. పవన్‌ను కాపు సామాజిక వర్గానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు రఘురామ. కాపుల్లో వైసీపీకి బలం లేదని, బీసీ, ఎస్సీల్లో కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు రఘురామ.

Read more RELATED
Recommended to you

Latest news