టీఆర్ఎస్ లో ప్రకంపనలు లేపిన రేవంత్ రెడ్డి ట్వీట్.. మరో మంత్రి టార్గెట్ !

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నేత. అలాంటి ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ కు సంబంధించి ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. దీంతో టిఆర్ఎస్ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈటల రాజేందర్ వ్యవహారంతోనే.. సతమతమవుతున్న.. టిఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న విభేదాలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ట్వీట్ తో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రాజకీయం రసకందాయంలో పడింది.

ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేసిన ఎం.పీ రేవంత్ రెడ్డి… “హంపిలో ధూమ్ ధామ్, కోవర్ట్ క్రాంతి కిరణాలతో కాకలా వికలం” అంటూ టిఆర్ఎస్ లోపలి రాజకీయాలను బట్టబయలు చేశాడు. జగదీష్ రెడ్డి టిఆర్ఎస్ రాజకీయానికి యముడు గంట కట్టినట్టేనా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఈటెల వ్యవహారం తర్వాత జగదీశ్ రెడ్డి వ్యవహారం బయటకు పొక్కడంతో ఇక ఆయన పని కూడా ఐపోయినట్టే ..అనే అర్థంలో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు. టిఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై రేవంత్ చేసిన ట్వీట్.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.