Mr King Review : `మిస్టర్ కింగ్` మూవీ రివ్యూ

-

నటీనటులు: శరన్ కుమార్, యస్వికా నిష్కల, ఉర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు
ఎడిటింగ్, దర్శకత్వం: శశిధర్ చావలి
నిర్మాత: బీఎన్ రావు
మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
సినిమాటోగ్రఫి: తన్వీర్ అంజుమ్
రిలీజ్ డేట్: 24-02-2023

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఎప్పటి నుంచో ఉంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్న హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. అలా రోజుకో హీరో పుట్టుకొస్తున్నాడు టాలీవుడ్ లో. అలా ఈ శుక్రవారం పుట్టుకొచ్చిన హీరో శరణ్ కుమార్. విజయ నిర్మల మనవడు శరణ్(సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు)) హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మిస్టర్ కింగ్ సినిమాతో ఇవాళ థియేటర్లలో సందడి చేశాడు. మరి ఈ కింగ్ ప్రేక్షకుల మనసు దోచాడా.. టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికినట్టేనా తెలియాలంటే సినిమా ఎలా ఉందో తెలియాలి.

స్టోరీ : విలువలు, నిజాయతీ, నిస్వార్ధంతో ఉండే శివ (శరణ్ కుమార్) ఏరోనాటికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ మాత్రేమే కాకుండా రేడియో జాకీగా కూడా పనిచేస్తుంటాడు. ఆకాశంలో విమానం విహరించే సమయంలో వాయు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దానికి ఇంధనంగా మార్చే పరిశోధనను చేస్తుంటాడు. అయితే పక్కింటి సీతారామారాజు (మురళీశర్మ) కూతురు ఉమాదేవి (యస్వికా నిష్కల)తో ప్రేమలో పడతాడు. కానీ జిత్తులమారి సీతారామారాజు తన అన్న కూతురు వెన్నెల (ఉర్వీ సింగ్)తో నిశ్చితార్థం చేయిస్తాడు. వెన్నెలతో నిశ్చితార్థం తర్వాత శివ జీవితంలో ఏం జరిగింది? ఏరో నాటికల్ ప్రాజెక్టును శివ పూర్తి చేశాడా? ఉమాదేవిని చివరకు పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ కింగ్ సినిమా కథ.

Read more RELATED
Recommended to you

Latest news