Mrunal Thakur : బికినీలో రెచ్చిపోయిన మృణాల్.. షాక్ లో నెటిజన్లు

-

సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మి పాత్రలో ఎంతో సంప్రదాయంగా కనిపించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఓ సౌందర్య లాంటి సంప్రదాయ హీరోయిన్ తెలుగు తెరకు మళ్లీ దొరికిందని తెగ సంబుర పడిపోయారు. సోషల్ మీడియాలోనూ ఈ భామ పోస్టు చేసే ఫొటోలు చూసి అలాగే ఫీల్ అయ్యారు.

అయితే ఈ మధ్య మృణాల్ కాస్త ట్రెండీగా మారింది. చూస్తుండగానే ఇంకాస్త బోల్డ్ గా మారిపోయింది. బోల్డ్ ఔట్ ఫిట్స్ లో ఘాటు పోజులిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ భామ ఇంతకు మించి అందాల ప్రదర్శన చేయదు అనుకున్న నెటిజన్లకు మృణాల్ షాక్ ఇచ్చింది. తాజాగా బికినీలో కనిపించి కుర్రాళ్లు గుండెలు కొల్లగొట్టేసింది.

వెకేషన్ లో ఉన్న మృణాల్ బ్లూ కలర్ బికినీ ధరించి బీచ్ లో సందడి చేసింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు కాస్త క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. మృణాల్ ను బికినీలో చూసి నెటిజన్లు తెగ ఫీల్ అవుతున్నారు. కొందరేమో ఎట్టకేలకు ఈ బ్యూటీ కూడా బీ టీమ్ లో జాయిన్ అయిందని కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో సీత ఇలా చేస్తుందని అనుకోలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news