ప్రజలకు దూరం అవడం నా అదృష్టమని మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు ముద్రగడ. నన్ను కన్నది నా తల్లిదండ్రులు అయితే పెంచి పోషించింది పత్తిపాడు నియోజకవర్గం అని ఆయన అన్నారు. రైతుల పూడి మండలం ములగపూడి రాజావరం గంగవరం దిగువ శివాడా అలానే ఎగువశివాడా రామకృష్ణ పురానికి చెందిన వైసిపి నాయకులు ముద్రగడ అనుచరులు ఈరోజు ముద్రగడని కలిసి వైసిపి విజయానికి కృషి చేస్తామని చెప్పారు.

ముద్రగడ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను 20 ఏళ్లు రాజకీయంగా పదవులు లేనప్పటికీ నా మీద చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అని అన్నారు. నన్ను నా తండ్రిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించడం వలన నేను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు ఈ ఎన్నికల్లో స్వయంగా తను ఆసక్తి చూపించే కాకినాడ పార్లమెంట్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి విజయానికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు అని వరపుల సుబ్బారావు అన్నారు.