ప్రధాని మోడీ పై దాఖలు చేసిన పిటిషన్ నీ కొట్టేసిన ఢిల్లీ హై కోర్టు..!

-

ఇటీవలే తన ప్రచార ప్రసంగంలో ఎన్నికల నిబంధనలను  ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోటీకి అనర్హత వేటు వేయాలని కోరుతూ పిల్ దాఖలు అయింది.    న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే దాఖలు చేసిన పిటిషన్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా “దేవుడు మరియు ప్రార్ధనా స్థలం” పేరుతో ఓట్లను కోరుతున్న మోడీ..  “హిందూ దేవతలు,  హిందూ ప్రార్థనా స్థలంతో పాటు సిక్కు దేవతలు,  సిక్కు ప్రార్థనా స్థలం” అని ప్రస్తావించారని పేర్కొన్నారు.

అయితే ప్రధాని మోడీ పై ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేయాలని దాఖలు అయిన పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు తోసిపుచ్చింది. ప్రధానంగా దేవుళ్లు, పుణ్యక్షేత్రాల పేర్లతో బీజేపీకి ఓట్లు అడుగుతున్నారని.. ఆయన పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. యూపీలోని పిలిభిత్ లో ఇటీవలే ఆయన చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఈ పిటిషన్ దాఖలు అయింది. ఇది తప్పుదోవ పట్టించేవిధంగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ విషయం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news