శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు

-

తిరుమల : అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 7వ తేది ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఇక 7వ తేది రాత్రి పెద్దశేష వాహనం.. 8వ తేది ఉదయం చిన్న శేషవాహనం….రాత్రి హంస వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 9వ తేది ఉదయం సింహ వాహనం….రాత్రి ముత్యపు పందిరి వాహనం జరుగనుండగా.. 10వ తేది ఉదయం కల్పవృక్ష వాహనం….రాత్రి సర్వభూపాల వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి.

 


11వ తేది ఉదయం మోహిని అవతారం….రాత్రి గరుడ వాహనం జరుగనుండగా.. 12వ తేది ఉదయం హనుమంత వాహనం….సాయంత్రం స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనం.. రాత్రి గజ వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 13వ తేది ఉదయం సూర్యప్రభ వాహనం….రాత్రి చంద్రప్రభ వాహనం జరుగనుండగా.. 14 వ తేది ఉదయం రథం బదులుగా సర్వభూపాల వాహనం ….రాత్రి అశ్వవాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 15వ తేది ఉదయం చక్రస్నానం….రాత్రి ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news