“అల వైకుంఠ పురంలో” సినిమాకు అవార్డుల పంట..!

నిన్న జ‌రిగిన సాక్షిఎక్స‌లెన్స్ అవార్డ్స్ అల వైకుంఠ‌పురంలో సినిమాకు ఏకంగా అవార్డుల పంట పండింది. ఈ సూప‌ర్ హిట్ సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు వ‌చ్చాయి. సినిమాకు ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్ అవార్డును ద‌క్కించుకున్నారు. అదేవిధంగా ఉత్త‌మ న‌టిగా పూజా హెగ్డె అవార్డును ద‌క్కించుకుంది. ఇక ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కాట‌గిరిలో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్త‌మ చిత్రంగా కూడా అల వైకుంఠ పురంలో సినిమా అవార్డును సొంతం చేసుకుంది.

దాంతో ఈ చిత్రానికి మొత్తం ఐదు అవార్డులు వ‌చ్చాయి. 2020 లో విడుద‌లైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రానికి 250 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అంద‌డం తో పాటు ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లు అవార్డులు రాగా సాక్షి ఎక్స‌లెన్స్ అవార్డులు కూడా సొంతం చేసుకోవ‌డంతో చిత్ర‌యూనిట్ ఆనందంలో మునిగి తేలుతుతంది. అవార్డుల ఫంక్ష‌న్ లో బ‌న్నీ, పూజాహెగ్డే తో పాటు చిత్ర యూనిట్ మెరిసింది. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌స్తుతం బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్ లో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తున్నాడు.