ఎంగేజ్మెంట్ చేసుకున్న ముక్కు అవినాష్… అమ్మాయి ఎవరంటే !

బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో… కట్టి పడేస్తున్నాడు ముక్కు అవినాష్. అవినాష్ ముక్కు కొంచెం పెద్దగా ఉండటంతో అందరూ అతని ముక్కు అవినాష్ అని పిలుస్తారు. అయితే ముక్కు అవినాష్ జబర్దస్త్ టీం లీడర్ గా పని చేశాడు. ఎన్నో కిడ్స్ లో తనదైన స్టైల్ లో కామెడీ చేసిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆ తర్వాత బిగ్ బాస్ షో లో అవకాశం రావడంతో జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు.

ఇక బిగ్బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉండగా.. అవినాష్.. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అవును… ముక్కు అవినాష్ కు లేటెస్ట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.

ఈ విషయాన్ని స్వయంగా అవినాష్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అంతేకాదు తన ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చాడు. “త్వరలోనే.. అనుజ తో నా పెళ్లి జరగనుంది. ఎప్పటిలాగే నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. త్వరలోనే అనుజ ను పెళ్లి చేసుకుంటున్నాను. మంచి వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే. అందుకే తాను కూడా పెళ్లికి ఓకే చెప్పేశాను” అంటూ అవినాష్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. చెడు ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.