చిచ్చు పెట్టిన లూడో గేమ్… తమ్ముడితో లేచి పోయిన అక్క !

మన దేశంలో రోజు కో దారుణం చోటు చేసుకుంటోంది. వాయి- వరసలు లేకుండా… అక్రమ సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. అయితే.. తాజాగా లూడో గేమ్‌ పిచ్చిలో పడి… ఏకంగా సొంత సోదరున్నే ప్రేమించింది ఓ లేడీ. అంతేకాదు… తన భర్తను వదిలి… సోదరునితోనే లేచిపోయింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధపూర్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నీతు అనే మహిళకు కొన్ని రోజుల కిందనే పెళ్లి జరిగింది. నీతుకు ప్రవీణ్‌ అనే సోదరుడు ఉన్నాడు. అయితే.. తన భర్త లేని సమయంలో ప్రవీణ్‌ తో కలిసి లూడో ఆడేది నీతు.

ఈ నేపథ్యం లోనే వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అక్కడితో ఆగకుండా… తన భర్తకు తెలియకుండా సోదరుడితో లేచిపోయింది నీతు. లేచి పోయిన ఈ జంట రిజిస్ట్రార్‌ మ్యారేజ్‌ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్‌ హ్యాండ్‌ ఇచ్చి… నీతు వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇక చేసేదేమీ లేక… స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు… ఈ కేసు విచారించారు. ఇక ఈ విచారణ నీతు బండారం బయట పడింది. భర్తను వదిలి లేచిపోయిందని.. పోలీసులు గుర్తించారు. నీతు మరియు ఆమె భర్తను కలిపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన గురించి ఇంకా తెలియాల్సి ఉంది.