ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసిన ముంబై హైకోర్ట్

-

ముంబై క్రుయిజ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ ముంబై హై కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ ఖాన్ తోపాటు మున్మున్ దమేచా, అర్బాజ్ మర్చంట్ లకు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 3న ముంబైలో క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ ఎన్సీబీకి పట్టుబడ్డాడు. అప్పటి నుంచి 21 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఆర్యన్ ఉన్నాడు. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఇన్నాళ్లు కస్టడీలో ఉన్నారు. తాజాగా ముంబై హై కోర్ట్ నిర్ణయంతో రేపు లేదా ఎల్లుండి ఆర్యన్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా ఆర్యన్ బెయిల్ పై ముంబై హై కోర్ట్ లో వాడీ వేడి వాదనలు జరిగాయి. ఇవ్వాల కూడా ఎన్సీబీ న్యాయవాదులు బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేఖించారు. ఎన్సీబీ తరుపున న్యాయవాదులు ఆర్యన్ తరుచుగా డ్రగ్స్ వాడటంతో పాటు, డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయనే వాదనలు వినిపించారు. మరోవైపు ఆర్యన్ ఖాన్ తరుపున ప్రముఖ లాయర్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నారనే దానికి సరైన ఆధారాలు లేవని, ఆర్యన్ దగ్గర నుంచి ఎటువంటి డ్రగ్స్ లభించలేదని తన వాదనలు వినిపించారు. కోర్ట్ ముకుల్ వాదనలతో ఏకీభవించింది. డ్రగ్స్ తీసుకున్నారనే దానికి ఆధారాలు సమర్పించడంలో ఎన్సీబీ విఫలమైంది. ఆర్యన్ ఖాన్ నుంచి రక్తనమూనాలు తీసుకున్నారా..? అందులో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందా..? అనే కోర్ట్ ప్రశ్నలకు ఎన్సీబీ దగ్గర సమాధానం లేకపోవడంతో ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా కేవలం వాట్సాప్ చాట్ చూపించి అరెస్ట్ చేయడం సబబుగా లేదని ముకుల్ రోహాత్గీ వాదించాడు. దీంతో ముకుల్ వాదనలో ఏకీభవించిన కోర్ట్ ఆర్యన్ తో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news