ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు…ఢిల్లీకి వెళ్ళి రెండురోజుల మకాం వేసినా సరే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీల అపాయింట్‌మెంట్ దొరకని విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులపై ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు…రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. అలాగే రాష్ట్రపతిని కలిసి పరిస్తితులని వివరించి…రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. అలాగే ఇవే విషయాలని హోమ్ మంత్రి, ప్రధానమంత్రికు కూడా వివరించాలని అనుకున్నారు. ఢిల్లీలోనే ఉండి వారి అపాయింట్మెంట్‌లు కోసం చూశారు. కానీ వారి అపాయింట్మెంట్‌లు దొరకక పోవడంతో చంద్రబాబు హైదరాబాద్‌కు తిరిగొచ్చేశారు.
తాజాగా అమిత్ షా, చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అమిత్ షా…బాబుకు ఫోన్ చేసిన వాస్తవమే అని తెలిసింది. అపాయింట్మెంట్ వేరే షెడ్యూల్స్ వల్ల ఇవ్వలేకపోయానని, అలాగే తనను కలసి ఏం చెప్పాలో తెలపాలని అమిత్ షా ఫోన్ లోనే చంద్రబాబును కోరినట్లు, త్వరలోనే కలుసుకుందామని చెప్పినట్లు కథనాలు వచ్చాయి.
అయితే అపాయింట్మెంట్ దక్కక తిరిగొచ్చేసిన తర్వాత చంద్రబాబుకు అమిత్ షా సడన్‌గా ఫోన్ చేయడానికి కారణాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీకి బాబుకు దూరం పెరిగింది…పైగా ఢిల్లీ వెళ్ళాక కూడా బాబుకు అపాయింట్మెంట్ దొరకలేదంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో బాబు, బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితోనే తిరిగి వచ్చేశారని చెప్పొచ్చు. కానీ అమిత్ షా సడన్‌గా ఫోన్ చేసి బాబుని కాస్త కవర్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
అది కూడా బద్వేలు ఉపఎన్నిక గురించి అని తెలుస్తోంది. అక్కడ టీడీపీ పోటీలో లేదు..బీజేపీ పోటీ చేస్తుంది. అయితే అక్కడ టీడీపీ సానుభూతిపరుల ఓట్లని దక్కించుకోవాలని బీజేపీ చూస్తుంది. ఇలాంటి సమయంలో మోడీ, అమిత్ షాలు బాబుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మైనస్ అవుతుంది…అందుకే అమిత్ షా మళ్ళీ ఫోన్ చేసి కవర్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు బీజేపీకి పడతాయి. కాబట్టి అమిత్ షా… బాబుకు ఫోన్ చేయడం వెనుక ఇంత పెద్ద కథ ఉండి.