సర్ప్రైజ్ :తిలక్ వర్మ ఇంట్లో ముంబై ఇండియన్స్ టీం !

-

ఐపీఎల్ సీజన్ 16 లో ఇప్పటికే 24 మ్యాచ్ లు ఏకబిగిన పూర్తి అయిపోయాయి. ఈ రోజు ఉప్పల్ స్టేడియం లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆడేందుకు ముంబై ఇండియన్స్ టీం నిన్న హైదరాబాద్ కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ టీం లో ఎంతో నిలకడగా రాణిస్తూ విజయాలను అందిస్తున్న యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ సొంతూరు హైదరాబాద్. అందుకే ముంబై ఇండియన్స్ టీం అంతా కలిసి తిలక్ వర్మ ఇంటికి సరదాగా వెళ్లారు. దీనితో తిలక్ వర్మ మరియు కుటుంబసభ్యులు ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు.

గొప్ప గొప్ప ఆటగాళ్లు అంతా తన ఇంటికి రావడంతో తిలక్ వర్మ ఆనందంలో మునిగితేలాడు. వారికీ మనస్ఫూర్తిగా తన ఆతిధ్యాన్ని ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటిలో వైరల్ గా మారాయి. మరి ఈ ఆనంద క్షణాల్లో తిలక్ వర్మ ఈ రోజు మ్యాచ్ లో అద్భుతంగా రాణించి ముంబైకు మరో విజయాన్ని అందిస్తాడా చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news