షార్జాలో ఆదివారం జరిగిన ఐపీఎల్ 2020 17వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. కానీ మిడిలార్డర్ చేతులెత్తేయడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌పై ముంబై 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్ (67 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (31 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు)లు రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్‌శర్మ, సిద్ధార్థ్ కౌల్‌లు చెరో 2 వికెట్లు తీశారు. రషీద్ ఖాన్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీష్ పాండే (30 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సన్, బుమ్రాలకు తలా 2 వికెట్లు దక్కాయి. కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశాడు.