ముంబై కొంప ముంచిన పండగలు

కరోనా మహమ్మారి మధ్య పండుగ కాలం ప్రారంభం అవుతున్న నేపధ్యంలో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కేంద్రం అంచనా వేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రధాన పండగలు వరుసలో ఉన్నాయి. ముంబై లో గణపతి పండుగ సందర్భంగా… చాలా జాగ్రత్తలు తీసుకున్నా సరే పండగ తర్వాత ముంబైలో కేసులు ఎక్కువగా పెరిగాయి. ఆగస్టు 20 నుంచి కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది.

ఇప్పుడు రోజువారీ కరోనా కేసుల పెరుగుదల శాతం 0.6 శాతం నుండి 1.3 శాతానికి పెరిగింది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇప్పుడు 1000 నుండి 2200 కు పైగా ఉంది. ఆగస్టు చివరి నాటికి, రోజువారీ సంఖ్యలు 1000 కన్నా తక్కువగా నమోదు అయ్యాయి. ఆ తరువాత ఆగస్టు మధ్యకాలం నుండి ముంబైలో మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 34.7 శాతంకు పెరిగింది. ఆగస్టు 15 న 128,000 ఉంటే… సెప్టెంబర్ 14 న 172,000 గా ఉంది.