2007ప్రపంచకప్.. అంతర్జాతీయ క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన మొదటి పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఇండియా వశమైంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో ఐదు పరుగుల తేడాతో ఇండియా కప్పు గెలుచుకొంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో ధోనీ సారథ్యంలో ప్రపంచ కప్ గెలుచుకుంది. 158 పరుగుల లక్ష్య ఛేధనలో పాకిస్తాన్ నిలబడలేకపోయింది. ఐతే ఈ విషయమై పాకిస్తాన్ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్, ఒకానొక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
నజీర్ మాట్లాడుతూ, నా క్రికెట్ కెరీర్ లో అత్యంత విచారించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది 2007 పొట్టి క్రికెట్ ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఓడిపోవడమే అన్నాడు. ఆ బాధ నా చివరి శ్వాస వరకూ నన్ను బాధిస్తూనే ఉంటుందన్నాడు. నిజానికి ఆ లక్ష్యాన్ని తాను ఛేధించగలననే నమ్మకంతో ఉన్నానని, కానీ అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచులో 14బంతుల్లోనే 33పరుగులు చేసిన నజీర్, 5.3ఓవర్లో రనౌట్ అయ్యాడు. అప్పటికీ పాకిస్తాన్ స్కోరు 55పరుగులుగా ఉంది.